బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : భారత్ సమ్మిట్‌ను, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గృహ నిర్బంధం విధించారు.

భారత్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారత వ్యతిరేక శక్తులను ఆహ్వానించి దేశ వ్యతిరేక సదస్సు నిర్వహిస్తోందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయకుండా, దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దేశ వ్యతిరేక గ్రూపులతో చేతులు కలిపి కాంగ్రెస్ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ నేతలు విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>