సాయికృష్ణ కేసులో మరో ఇద్దరు అరెస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: గాదె సాయికృష్ణ మిస్సింగ్​ కేసు (Sai Krishna Missing Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీల‌క నిందితుడిగా భావిస్తున్న సీఐ నాగ‌రాజు ఇప్ప‌టికే అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. సాయికృష్ణ హ‌త్య‌కు గురైన‌ట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ హ‌త్య‌లో సీఐ నాగ‌రాజుకు మ‌రో ఇద్ద‌రు కానిస్టేబుల్స్‌ స‌హ‌కరించార‌ని సిట్ విచార‌ణ‌లో తేలింది.

దీంతో నేడు కృష్ణ‌లంక క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్స్ బాబురావు, సాంబ‌య్య‌ల‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబురావును ఏ5గా, సాంబ‌య్య‌ను ఏ6గా పేర్కొన్నారు. ఇప్ప‌టికే సిట్ అధికారులు వీరిద్ద‌రినీ సుధీర్ఘంగా విచారించిన‌ట్లు తెలిసింది. భారీ భ‌ద్ర‌త న‌డుమ ఇద్ద‌రిని రెండో ఏసీఎం కోర్టుకు త‌ర‌లించారు. మ‌రికొద్ది సేప‌ట్లో కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>