గాంధీ కుటుంబంపై సోషల్ మీడియా పోస్టులు.. కంగానాపై కేసు నమోదు!

కలం, నేషనల్‌ డెస్క్: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబానికి (Gandhi Family ) సంబంధించి సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు, పోస్టులపై (Social Media Posts) అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిమ్లాలోని బాలుగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.

సిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఆదేశాలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10వ తేదీన కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి పలు పోస్టులు పెట్టారని అతుల్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై కంగనా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ‘మిస్టీరియస్ ఫారిన్ నేషనల్’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంజయ్ గాంధీ మరణం అనంతరం ఆయన భార్య మేనకా గాంధీని కుటుంబ నివాసం నుంచి బయటకు పంపించారంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ పోస్టులు రాజకీయ విమర్శల పరిధిని దాటి ప్రజల మధ్య విద్వేషాలను పెంచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అతుల్ శర్మ ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆమె వివరణ వెలువడితే ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>