కలం, వెబ్ డెస్క్: రాప్తాడు బాలికపై దాడి కేసు (Rapthadu Case)లో నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో అతడు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వైద్య పరీక్షల్లో హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం హేమంత్ ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూలుకు నిందితుడిని మార్చారు. ప్రత్యేక వాహనంలో భారీ భద్రత మధ్య తరలించారు.
కాగా, పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి 13 రోజులుగా నిందితుడికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం అతడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించగా.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టినట్లు తెలిసింది. పల్మనరీ ఎంబాలిజంగా గుర్తించి హేమంత్ ఆరోగ్యం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగై వైద్యం అవసరమని వైద్యులు భావించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల్లో అతడిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

