epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రూటుమార్చిన గంజాయి బ్యాచ్.. దందాలోకి మహిళలు

కలం, నిజామాబాద్ బ్యూరో : గంజాయి విక్రేతలు రూటు మార్చారు. స్మగ్లర్ల ఐడియానో మరి అమ్మకం దారుల ప్లాన్ లో భాగమో కానీ మహిళలను గంజాయి దందాలోకి ఎంటర్ చేశారు. గురువారం నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద 13 కిలోల ఎండు గంజాయిని సరఫరా (Ganja Smuggling) చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్​ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు గంజాయి తీసుకొస్తుండగా వీరు పట్టుబడ్డారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు.

గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.. వీరిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పూజా పవార్, దుర్వాద బాయ్ ఇద్దరు కీలక వ్యక్తులుగా తేలారు. వారితో పాటు మహారాష్ట్రకు చెందిన కిరణ్ మోతిరామ్, ఇంద్రజిత్ టాగ్రె, కామారెడ్డి జిల్లాకు చెందిన మంజ వెంకట్రామ్ లు అరెస్ట్​ అయ్యారు. ఇద్దరు మహిళలు మధ్యప్రదేశ్ లోని సిర్పూర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి కిలో గంజాయి రూ. 9000 కు కొనుగోలు చేశారు.

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి బస్ లో నిర్మల్ వచ్చి అక్కడి నుండి నిజామాబాద్ బైపాస్ లో బస్సులో దిగి కామారెడ్డి జిల్లా వాసికి అందించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు. 15 వేలకు కొన్న గంజాయిని నిజామాబాద్ పట్టణంలో రూ.20,000కు కిలో చొప్పున అమ్ముతున్నట్టు (Ganja Smuggling) గుర్తించారు. గంజాయి బ్యాచ్​ ను పట్టుకున్న వారిలో ఎక్సైజ్ సీఐ స్వప్న, ఎస్సైలు మల్లేశ్​, సుష్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ లు ఉన్నారు. కాగా, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాకు రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు కట్టడి చేస్తున్నారు.

Read Also: పంట నిల్వకు రూట్ మ్యాప్ : మంత్రి ఉత్తమ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>