కలం, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) కు నగారా మోగనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 3న ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకే విడతలో ఎన్నికలు జరిగేలా ప్రాథమిక షెడ్యూలు తయారైంది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా, వార్డులవారీ పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల బాధ్యతలు, నియామకంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఎస్ఈసీ దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. దీని ప్రకారం మున్సిపోల్స్‌కు ఈ నెల 16 షెడ్యూల్ విడుదల కానుంది.
అలాగే జనవరి 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం జనవరి 24న గుర్తులు కేటాయిస్తారు. 25 నుంచి ప్రచారం మొదలవుతుంది. ఫిబ్రవరి 1న ప్రచారం ముగింపు, అదే నెల 3న ఎన్నికలు, 6న కౌంటింగ్ ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
క్లుప్లంగా మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) షెడ్యూల్ ఇలా..
Jan 16న : షెడ్యూల్.
Jan 18-20 : నామినేషన్.
Jan 21 : నామినేషన్ల పరిశీలన.
Jan 23 : నామినేషన్ల ఉపసంహరణ.
Jan 24 : గుర్తుల కేటాయింపు.
Jan 25 : ప్రచారం.
Feb 1 : ప్రచారం ముగింపు.
Feb 3న : పోలింగ్.
Feb 6న : కౌంటింగ్.
Read Also: మేడారంలో బంగారం కిలో రూ.60
Follow Us On: X(Twitter)


