కండ‌క్ట‌ర్‌ను చెంప‌దెబ్బ కొట్టిన మ‌హిళ‌.. ఏపీ ఫ్రీ బ‌స్సులో ఘ‌ట‌న‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు (Free Bus) పెట్ట‌డం పుణ్య‌మా అని ప్ర‌తి చోట ఏదో ఒక ఘ‌ట‌న జ‌రుగుతూనే ఉంది. అది కాస్తా సోష‌ల్ మీడియా (Social Media)లో వైర‌ల్‌గా మారుతోంది. తాజాగా ఏపీ ఉచిత బ‌స్సు (AP Free Bus)లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ బస్సు కండ‌క్ట‌ర్‌ను చెంప దెబ్బ కొట్టింది. బ‌స్సులో మొద‌లైన పంచాయితీ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుంది. విజయవాడ నుంచి విసన్నపేట వెళ్లే బస్సులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విజ‌య‌వాడ‌ (Vijayawada)లో ఇద్ద‌రు మ‌హిళ‌లు బస్సు ఎక్కారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ సమీపంలోకి రాగానే టికెట్ తీసుకోవాలని కండక్టర్ శ్రీనివాస రావు అడిగాడు. స‌ద‌రు మ‌హిళ‌లు ఇద్ద‌రే ఉండ‌గా మూడు ఆధార్ కార్డులు చూపించి రెండు టికెట్లు ఇవ్వాలని కోరారు. దీంతో వివాదం మొద‌లైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెర‌గడంతో స‌ద‌రు మ‌హిళ‌ కండక్టర్ చెంప పగలకొట్టింది. అనంత‌రం కండక్టర్ బస్సుతో సహా నున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దాడి జరిగిన ప్ర‌దేశం తమ పరిధి కాదని నున్న పోలీసులు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కండ‌క్ట‌ర్ త‌న‌ను దూషించాడ‌ని, అందుకే కొట్టాన‌ని మ‌హిళ ఆరోపిస్తోంది. టికెట్ తీసుకోవాలని మాత్రమే చెప్పానని, ఎవ‌ర్నీ తిట్ట‌లేద‌ని కండక్టర్ చెప్తున్నాడు. తనను అకారణంగా చెంప దెబ్బ కొట్టిందని మహిళపై కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏదేమైనా ఫ్రీ బ‌స్సు మొద‌ల‌య్యాక ఆర్టీసీ బ‌స్సుల్లో ఆస‌క్తికర ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>