Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్!

క‌లం, వెబ్ డెస్క్‌: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను పోలీసులు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను పరామర్శించేందుకు హరీశ్ రావు బయలుదేరారు. అప్పటికే ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>