Mobile Popup Ad
Mobile Popup Ad

మేము టెర్రరిస్టులమా..? నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ (Renu Desai) నెటిజన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని అసభ్య కామెంట్లను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. కళాకారులు ఏమైనా టెర్రరిస్టులా, రేపిస్టులా, నేరస్తులా? అంత దారుణమైన బూతులు తిట్టడానికి వారు ఏం తప్పు చేశారు? అని ఆమె (Renu Desai) నిలదీశారు. వ్యక్తి పని చేసే తీరు లేదా మాటలు నచ్చకపోతే, వారిని అన్ ఫాలో చేసి మీ దారి మీరు చూసుకోవాలి తప్ప.. అసభ్యపదజాలంతో మాట్లాడం సంస్కారం కాదని హితవు పలికారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతిస్తున్నారని రేణు దేశాయ్ మండిపడ్డారు. ‘మీకు నచ్చని అభిప్రాయం చెబితే వెంటనే బూతులు తిట్టం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు.. అది వేధింపులు మాత్రమే. ప్రతీ వ్యక్తికి గౌరవంగా బతికే హక్కు ఉంది.. దాన్ని కాలరాయకండి’ అంటూ రేణు దేశాయ్ కోరారు. కాగా, రేణు మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారడంతో పాటు సినీ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>