కలం వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) ఇప్పిస్తానని చెప్పి, వారి నుంచి భారీగా డబ్బుబు వసూలు చేస్తున్న ఓ కేడీ లేడీ ఉదంతం నిజామాబాద్‌లో (Nizamabad) వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌కు చెందిన స్వరూప అనే మహిళ నిజామాబాద్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పుకుంటూ పలువురు నిరుద్యోగుల దగ్గర లక్షల్లో వసూలు చేసింది. ఇంతటితో ఆగకుండా వారికి నియామక పత్రాలు కూడా అందజేసింది. వీటిపై కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్ల సంతకాలు కూడా ఉన్నాయి. చివరికి ఉద్యోగం కోసం వెళ్లడంతో బాధితులకు అవి దొంగ సంతకాలని, మోసపోయామని అర్థమైంది.
బాధితులు స్వరూపను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. బాధితులంతా పోలీస్ స్టేషన్‌కు క్యూకట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసి సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఉదంతంలో మరో కానిస్టేబుల్ కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి నిరుద్యోగుల దగ్గర భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: చోటా vs బడా.. రసవత్తరంగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు
Follow Us On: X(Twitter)


