కలం వెబ్ డెస్క్ : రంగారెడ్డి (Rangareddy) జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో (Abdullapurmet) భారీ ఆవుల అక్రమ రవాణా(Cattle Smuggling) బయటపడింది. దీని వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం ఓ లారీలో 70 ఆవుల్ని తరలిస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిందితులను పట్టుకున్నారు. గో సంరక్షకులు ఆవులను లారీలో నుంచి దింపి రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆవులను తరలిస్తున్న లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. గోవులను రక్షించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులున్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read Also: 40 ఏళ్ల తర్వాత హార్ట్ ఎటాక్స్.. ఈ జాగ్రత్తలు మస్ట్!
Follow Us On: Youtube


