Mobile Popup Ad
Mobile Popup Ad

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య దారుణ హత్య?

కలం, ఖమ్మం బ్యూరో: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం (Tirumalayapalem) మండలంలో చోటు చేసుకుంది. అంతటితో ఆగకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి నిందితుడు పరారైన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పాతర్లపాడు స్టేజి సమీపంలోని గోల్‌తండాకు చెందిన మీనాక్షి, శివాజీకి 14 ఏళ్ల కిందట వివాహం కాగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు. శివాజీ ఇంటిపై రూ.80 లక్షల వరకు రుణం ఉండగా.. ఇదే సమయంలో భార్య మీనాక్షి పేరు మీద రూ.కోటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఇంటి లోన్ తీర్చాలంటే.. ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గమని.. దారుణమైన పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

పిడిగుద్దులతో తీవ్రంగా హింసిస్తూ..

​శివాజీ గత కొంతకాలంగా భార్య మీనాక్షిని మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. గతంలో ఆమెను కింద పడేసి పిడిగుద్దులతో అత్యంత దారుణంగా హింసించిన దృశ్యాలను బంధువులు మీడియాకు విడుదల చేయడంతో అంతా షాకవుతున్నారు. రోజురోజుకూ అతడి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మీనాక్షిని దారుణంగా చిత్రవధ చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పరారయ్యాడు. వారు బంధువులతో ఘటనా స్థలానికి (Tirumalayapalem) చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ దారుణ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే దిశగా పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని.. శివాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 14 ఏళ్ల వైవాహిక బంధం, ఇద్దరు పిల్లలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా డబ్బు కోసం భార్యను పొట్టనబెట్టుకున్న ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

Read Also: రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>