Mobile Popup Ad
Mobile Popup Ad

నిమ్స్‌ అరుదైన రికార్డు.. సీఎం రేవంత్ అభినందనలు

కలం, వెబ్ డెస్క్ : కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి సీఎం ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (NIMS) కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.

నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ నెంబర్ వన్​గా నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో గుజరాత్​ లోని ఐకేడీఆర్‌సీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లూథియానా క్రిస్టియ‌న్ కాలేజీలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానంలో ఉంది.

ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి సీఎం ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కాగా, కిడ్నీ మార్పిడి చేసిన 2,000 మందిలో 1,900 మంది అంటే 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, , ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడు ఏండ్ల నాలుగు నెలల్లోనే.. 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు నెలకొల్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>