కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పర్యటనలపై మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ (Devineni Uma) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ అరిష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ తాజా పర్యటన వల్ల ఇద్దరు అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
రోడ్లపై సాగుతున్న కారు ర్యాలీలు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉమ విమర్శించారు. కనీసం అత్యవసర పరిస్థితిలో ఉన్న అంబులెన్స్‌లకు కూడా దారి ఇవ్వకుండా ఈ రోడ్ షోలు నిర్వహించడం జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన మీడియా సాక్షిగా మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయ ప్రచారమే ముఖ్యం అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ (Devineni Uma) ధ్వజమెత్తారు.
Read Also: ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజల కలకలం!
Follow Us On: X(Twitter)


