కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులతో ప్రజల ముందే ప్రమాణం చేపించడం ఆసక్తికరంగా మారింది. గెలిస్తే పార్టీ మారొద్దని అభ్యర్థులతో దైవ సాక్షిగా ప్రమాణం చేపిస్తున్నారు. శనివారం కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ అభ్యర్థితో నిరంతరం ప్రజలకు అదుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని ప్రమాణం చేపించారు. అలాగే దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం, కరీంనగర్ అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పించారు. గెలిచిన తర్వాత బీజేపీలోనే కొనసాగుతాను తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, నిరంతరం పార్టీ కోసం, నిబద్ధతతో, అంకిత భావంతో పని చేస్తానని, దైవ సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేపించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అధికార పార్టీలోకి వెళ్తారన్న భయంతోనే బండి సంజయ్ (Bandi Sanjay) ఇలా ప్రమాణం చేపిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read Also: ఏ కేసు ఫైళ్లు కాలిపోయాయో ఇంకా తెలీదు : డీసీపీ శిల్పవల్లి
Follow Us On : WhatsApp


