Mobile Popup Ad
Mobile Popup Ad

పాక్ బాయ్‌కాట్ వివాదం.. అందుకు ఛాన్స్ లేదన్న ఇర్ఫాన్ పఠాన్

కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్ (India Pakistan Match) బాయ్‌కాట్ వివాదంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నిర్ణయం శాశ్వతం కాదని అభిప్రాయపడ్డారు. ఐసీసీ నిబంధనల ప్రకారం టోర్నీలో కొన్ని జట్లను ఎంపిక చేసుకుని, వాటితో మాత్రమే మ్యాచ్‌లు ఆడే చాన్స్ లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ జరిమానాలు లేదా నిషేధానికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ఒత్తిళ్ల కారణంగా పాకిస్థాన్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని మ్యాచ్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉందని విశ్లేషించారు. అంతర్జాతీయ టోర్నీల్లో ఐసీసీ నియమాలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.

మ్యాచ్ జరిగితే మాత్రం ప్రస్తుత భారత జట్టును ఎదుర్కోవడం పాకిస్థాన్‌కు సవాలేనని పఠాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డారు. 2025 ఆసియా కప్‌లో భారత్ వరుసగా మూడుసార్లు పాకిస్థాన్‌ను ఓడించిన నేపథ్యాన్ని గుర్తు చేశారు. గత రికార్డులు చూస్తే గ్రూప్ దశలో భారత్‌కు పెద్ద సవాళ్లు ఎదురుకాలేదని పఠాన్ తెలిపారు. ప్రపంచ కప్ ఆరంభంతో పాటు ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఐసీసీ నిర్ణయాలు, రెండు దేశాల వైఖరే తుది దిశను నిర్దేశించనున్నాయి.

Read Also: అల్‌నస్ర్ మ్యాచ్‌కు రొనాల్డో మళ్ళీ దూరం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>