Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజ‌ల క‌ల‌క‌లం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో ఓ ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజ‌లు(Black magic) చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది త‌న‌కు తెలిసిన వారి ప‌నేనంటూ స‌ద‌రు ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే బండారు శ్రావణి(Bandaru Sravani) ఇంటి ముందు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేసి వెళ్లారు. శుక్ర‌వారం ఉద‌యం కారులో వచ్చి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఇంటి ముందు నిమ్మకాయలు వేయడం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు హుటాహుటిన కారుని వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే దుండ‌గులు త‌ప్పించుకున్నారు. ఇది తెలిసిన వారి పనేనంటూ ఎమ్మెల్యే శ్రావణి ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తనపై ఇలానే దాడి చేస్తున్నార‌ని చెప్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>