epaper
Monday, November 17, 2025
epaper

టీ-షర్ట్‌లో ‘T’కి అర్థం ఏంటో తెలుసా..?

టీ-షర్ట్స్(T shirt).. ఇప్పుడొక ష్యాషన్. ప్రతి ఒక్కరూ వీటిని ధరిస్తారు. ఆడ, మగ అన్న తేడా లేదు. ఇన్‌ఫార్మల్‌గా ఉండే సమయంలో వీటిని ధరిస్తారు. వీటికి డిమాండ్‌ కూడా చాలా ఎక్కువే. ప్రస్తుతం ఇవి ఫ్యాషన్‌కు మారురూపంలా మారాయి. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకునే వారి ప్రథమ ఎంపిక టీ-షర్ట్ అనడం అతిశయోక్తేమీ కాదు. అయితే వీటిని వాడటం అయితే అందరూ చేస్తున్నారు. కానీ, వీటిని అసలెందుకు తయారు చేశారు. వీటి పేరులోని టీ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కొందరైతే చాలా సింపుల్ మీనింగ్ ఒకటి చెప్పేస్తారు. అదేంటంటే.. ‘టీ’ షర్ట్‌ని ఫ్లాట్ సర్ఫేస్‌పైనే పరిస్తే అది ఇంగ్లీష్ అక్షరం ‘T’లా కనిపిస్తుందని, అందుకే వీటిని టీ షర్ట్స్ అంటారని అంటారు. కానీ, అసలు కారణం అది కాదు. టీ-షర్ట్‌లో ‘టీ’అంటే ఏంటో తెలియాలంటే ముందుగా వాటి చరిత్ర తెలియాలి.

1950ల్లో సామాన్య ప్రజల్లో టీ-షర్ట్‌(T shirt)లు చాలా ప్రాచుర్యం చెందాయి. అప్పుడప్పుడే కొందరు స్టార్ నటులు తమ సినిమాల్లో వీటిని ధరించి కనిపించారు. హాలీవుడ్ యాక్టర్ మార్లన్ బ్రాండో తన ‘ఏ స్ట్రీట్‌కార్ నేమ్‌డ్ డిజైర్’ అన్నసినిమాలో, జేమ్స్ డీన్ తన ‘రెబెల్ వితౌట్ ఏ కాజ్’ సినిమాల్లో టీ-షర్ట్‌లను ధరించారు. ఆ ఇద్దరు నటులు టీ-షర్ట్‌ను లోదుస్తులుగా కాకుండా ఫ్యాషనబుల్ వేర్‌గా మార్చారు. ఆ తర్వాత కాలక్రమేణా అవి ఫ్యాషన్‌కు చిహ్నంలా మారాయి.

అయితే అంతకుమందు టీ-షర్ట్‌లు లోదుస్తులుగా ఉండేవి. అది కూడా సైనికులు తమ శిక్షణ సమయంలో ధరించేవారు. తేలికగా ఉండటం కోసం, గాలి ఆడటం కోసం వీటిని ధరించేవారు. దాంతో పాటుగా వీటిని ధరించడం, తొలగించడం చాలా సులభంగా, తొందరగా జరుగుతుంది. అందుకని ఆ సమయంలో సైనికులు తమ ట్రైనింగ్ సమయంలో వీటిని వినియోగించేవారు. దాని కారణంగా వీటికి ట్రైనింగ్ షర్ట్స్ నుంచి టీ-షర్ట్స్‌గా మారాయి.

Read Also: ఇలాంటి పాస్‌వర్డ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>