అనంతపురం(Anantapur) జిల్లా కేంద్రంలో హిజ్రాలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆసిఫ్ అనే యువకుడు తమ తరహాలో వేషధారణ వేసుకుని దందా చేస్తున్నాడని, దాని వల్ల తమకు దందా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దందా నిర్వహిస్తూ తమను మానసికంగా వేధిస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, ఆసిఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హిజ్రాలు పోలీసులకు అందించారు. హిజ్రాలు రోడ్డుపై భైఠాయించి ఆందోళన తెలుపుతుండటంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్ పట్టుకుని తమకు న్యాయం చేయకుండా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని వారు బెదిరించారు.
Read Also: టీ-షర్ట్‌లో ‘T’కి అర్థం ఏంటో తెలుసా..?

