టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit).. తన ప్రేయసి శిరీష(Sireesha Lella)తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరికి గతేడాది అక్టోబర్‌లోనే నిశ్చితార్థం అయినా.. అతని తండ్రి మరణంతో వివాహ వాయిదా పడింది. ఇప్పుడు వారి పెళ్ళికి అన్ని అడ్డంకులు తొలగడంతో వారు పెళ్ళి పనులు ప్రారంభిచేశారు. ఈ క్రమంలో నారా రోహిత్ ఇంట పెళ్ళి సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫొటోలను శిరీష షేర్ చేసుకుంది.
శిరీష ఫొటోలు చూసిన ఫ్యాన్స్ అంతా ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. నారా రోహిత్(Nara Rohit), శిరీష ఇద్దరూ కూడా ‘ప్రతినిధి 2’లో కలిసి నటించారు. వీరి పెళ్ళిని ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దగ్గరుండి జరిపిస్తున్నారు.
Read Also: ఓటీటీ ఎంట్రీకి ‘ఓజీ’ రెడీ..

