ధరణి అనేది తెలంగాణకి పట్టిన దరిద్రం అంటూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దరిద్రం వల్లే ఎన్నో దారుణ ఘటనలు జరిగాయని అన్నారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సర్వేయర్లకు సీఎం రేవంత్ ఆదివారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగానే ఆయన ధరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏ ప్రాంతానికి లేని గొప్ప చరిత్ర తెలంగాణకు ఉంది. భూమి కోసం చాకలి ఐలమ్మ పోరాడారు, ఆమె తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. ఈ భూమి కోసమే కొమురం భీం ‘జల్-జమీన్-జంగల్’ నినాదంతో పోరాటం చేశారు,” అని సీఎం అన్నారు.
“ధరణి(Dharani) చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ధరణి అనే దరిద్రం వల్లే ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగులబెట్టే పరిస్థితి వచ్చింది. ధరణి వల్లే అసలు తెలంగాణ భూ సమస్యలు వచ్చాయి. దానిని సరిచేయడం కోసమే ధరణిని తొలగించి. పక్కాగా ఉండేలా భూభారతి(Bhu Bharati)ని తీసుకొచ్చాం” అని వ్యాఖ్యానించారు. సర్వే వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు.
Read Also: ఎన్నికల్లో పోటీకి వయోపరిమితి తగ్గింపు అవసరం: రేవంత్

