ఫీజు రియంబర్స్‌మెంట్ అంశంలో మారోసారి బంద్‌కు పిలుపిచ్చాయి తెలంగాణ ప్రైవేట్ కాలేజీలు(Private Colleges). తమకు ఫీజు రియంబర్స్‌మెంట్ నిదులు చెల్లించాలని, లేని పక్షంలో బంద్ అనివార్యమని స్పష్టం చేశాయి. ఫీజు రియంబర్స్‌మెంట్(Reimbursement) నిధులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలు నవంబర్ 1వరకు సమయం ఇచ్చాయి. ఇచ్చిన హామీ ప్రకారం రూ.900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుకు వినతి పత్రం అందజేశాయి. నిధులు విడుదల చేయకుంటే నవంబర్ 3 నుంచి బంద్ చేరస్తామని స్పష్టం చేశాయి.
అయితే ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు(Private Colleges) ఒకసారి బంద్‌కు పిలుపునిచ్చాయి. దాంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలకు కూర్చుంది. వారికి రూ.900 కోట్లు విడుదల చేస్తామని, మిగిలిన బకాయిలను కూడా త్వరితగతిన చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కాగా ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు మరోసారి బంద్ బాట పట్టడానికి సిద్ధమయ్యాయి.
Read Also: ధరణి అనే దరిద్రం వల్లే తిప్పలు: సీఎం రేవంత్

