Mobile Popup Ad
Mobile Popup Ad

గుత్తి కోయల ‘నీటి’ గోస.. 30 అడుగులు బావి తవ్వినా తీరని దాహం!

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులు మారుతున్నా గిరిజన గ్రామాల పరిస్థితి మారడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా కనీస వసతులకూ నోచుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యంకావడం లేదు. కనీసం బిందెడు నీళ్ల (Drinking Water) కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ’దాహమో రామచంద్రా‘ అంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. నేటికీ బావులపై ఆధారపడుతూ దాహర్తీని తీర్చుకుంటున్నారంటే ట్రైబల్ ఏరియాల్లో నీటి కష్టాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఎండలు దంచికొడుతుండటంతో ములుగు (Mulugu) జిల్లా మంగపేట మండలంలోని శాంతినగర్ గూడెంలో తాగునీటి కష్టాలు గిరిజనుల ప్రాణాలకు పరీక్షగా మారాయి. చుక్క నీరు దొరకని దుస్థితి నెలకొనడంతో దాహార్తిని తీర్చుకోవడానికి గూడెంకు చెందిన గుత్తి కోయ గిరిజనులు 20 రోజులుగా స్వయంగా ఓ బావిని తవ్వుతున్నారు. ప్రాణాలకు తెగించి సుమారు 30 అడుగుల లోతు వరకు తవ్వుకున్నారు. చుక్క నీరు పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదురుతున్న వేళ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. వెంటనే శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, లేదంటే తమ మనుగడ కష్టమవుతుందని గూడెం వాసులు అధికారులను కోరుతున్నారు.

Read Also: నేను విదేశీ ప్లేయర్‌నా?: వైరల్ జోక్స్‌పై విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>