అదే జరిగితే 2029లో జగన్ దే విజయం: ఉండవల్లి

కలం, వెబ్ డెస్క్: 2029 ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arun Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ (YS Jagan) గ్రాఫ్ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉందని.. కూటమి కలిసి ఉంటే 2029 ఎన్నికల్లో టఫ్ ఫైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ 2029 ఎన్నికల్లో కూటమి విడిపోతే జగన్‌కు 2019 ఎన్నికల మాదిరిగా వార్ వన్ వన్‌సైడ్ అవుతుందని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే కూటమి ఉంటుందా లేదా అన్నది ప్రధాని మోదీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అధికారం కోసం బీజేపీ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

2024 ఎన్నికల్లో ఆ రోజే గెలుపు ఫిక్స్!

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబు (Chandrababu) కలిసిన వెంటనే వార్ వన్ సైడ్ అయ్యిందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జగన్ ప్రభుత్వం పవన్, బాబులను ఇబ్బంది పెట్టడం వల్లే వారు ఏకమయ్యారని తెలిపారు. దీంతో రాజమండ్రి జైలులో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసిన రోజే 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిదో డిసైడ్ అయ్యిందని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి పలు నిర్ణయాల వల్ల కూడా 2024 ఎన్నికల్లో వైసీపీకి డ్యామేజ్ అయిందని చెప్పారు. జగన్ కమ్మవారికి, కాపులకు వ్యతిరేకమనే ప్రచారం కూడా కూటమికి కలిసొచ్చిందని అన్నారు.

లోకేష్ సీఎం ప్రచారంపై కామెంట్స్

రాబోయే రోజుల్లో నాయకత్వ మార్పుపై జరిగే ప్రచారం కూటమికి నష్టం కలిగించవచ్చని ఉండవల్లి (Vundavalli Arun Kumar)హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఒకవేళ నారా లోకేష్ సీఎంగా ప్రచారం చేస్తే అది కాపు ఓటర్లలో అసంతృప్తికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. కాపు పెద్ద లీడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కు అన్యాయం చేసినట్లే అవుతుందని.. దీన్ని వల్ల 2029 ఎన్నికల్లో కాపు ఓటర్ల నుంచి ఓట్లు చీలే ప్రమాదం ఉందని విశ్లేషించారు.

రాజధానిపై వైఎస్సార్‌సీపీ స్పష్టత ఏది?

రాజ్యాంగంలో రాజధాని అనే పేరు లేదని.. 2014 ఎన్నికల తర్వాత అమరావతిని (Amaravati) రాజధాని నిర్ణయించిన సమయంలో వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో వారి నిర్ణయాన్ని చెప్పాల్సిందని సూచించారు. ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.. రాజధాని విషయంలో ఎవరి ఎజెండా వారికి ఉందన్నారు. రాష్ట్రంలో మతపరమైన అంశాలపై వివాదాలు నడుస్తున్నాయని.. గతంలో ఇలా మతాల గురించి పెద్దగా చర్చ లేదని.. 2014 తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పుకొచ్చారు.

Read Also: ప్రధాని మోదీ రిమోట్ ఆయన దగ్గరే ఉంది.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>