Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్‌తో జీవితం అంధకారం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

కలం హనుమకొండ: డ్రగ్స్ తీసుకుంటే యువత జీవితాలు అంధకారంగా మారుతాయని వరంగల్ (Warangal) పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh) హెచ్చరించారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె పరుగును పోలీస్ కమిషనరేట్ దగ్గర ప్రారంభించారు.

సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు 2కే రన్ కొనసాగింది. ప్రతిభ కబరిచినవారికి పతకాలు, సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం సీపీ (CP Sunpreet Singh) మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దన్నారు. మత్తు పదార్థాలను విక్రయాలు, వినియోగిస్తే చిక్కుల్లో పడుతారని తెలిపారు. కేవలం చదువులపైనే దృష్టి పెట్టాలన్నారు.

వారి బాధ వర్ణనాతీతం..

పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మాట్లాడుతూ.. మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణకై ఈగల్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా 1908 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాలు, తల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమని తెలిపారు.

ఈ పరుగులో పాల్గొన్న యువత, విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సైనికుడిలా పనిచేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. “ఐయాం యాంటీ డ్రగ్స్ సోల్జర్” సెల్ఫీ పాయింట్ ఫొటోలు దిగారు. వరంగల్ కలెక్టర్ డా.సత్యశారద, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంట్రామిరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్‌ కుమార్, అడిషినల్ కలెక్టర్ సంధ్యతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డిని ఏమనాలి: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>