Mobile Popup Ad
Mobile Popup Ad

మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డిని ఏమనాలి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో నానా అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలకు 3 సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారని.. 30 నెలలైనా హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు.

 సీఎంకు కేటీఆర్ సవాల్..

వికారాబాద్ జిల్లా పరిగి (Parigi) నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ అభయహస్తం పేరు మీద రూ. 12 లక్షలు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు పరిగిలో అసైన్డ్ భూముల గుంజుకుంటున్నారని ఆరోపించారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్న రేవంత్ రెడ్డి, కనీసం వారికి ఇస్తామన్న 2,500 రూపాయలు ఇస్తే లక్షాధికారులు అవుతారని చెప్పారు. రాష్ట్రంలోని కోటి 68 లక్షల మంది ఆడబిడ్డల ఖాతాల్లో రూ.లక్షా యాభై వేలు వేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు.

లగచర్ల అరాచకాలు ఎవరూ మర్చిపోలేదు..

ఒకసారి మోసపోతే మోసం చేసినవాడి తప్పవుతుందని.. కానీ పదే పదే కాంగ్రెస్ చేతిలో మోసపోకుండా మనం కలిసి కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పారు. రాబందు పోవాలే, రైతుబంధు కేసీఆర్ రావాలన్న లక్ష్యంతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని దింపి కేసీఆర్ ని తిరిగి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించాలంటే అందరం సమిష్టిగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిగిలోని ప్రతి గ్రామానికి, తాండాకి, ఇంటింటికీ కేసీఆర్ నీళ్ళిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆడబిడ్డలపైన, గిరిజనులపైన, లగచర్లలో చేసిన అరాచకాలను ఎవరూ మర్చిపోలేదని అన్నారు.

SIRపై అప్రమత్తంగా ఉండాలి..

తెలంగాణలో జరుగుతున్న సర్ (SIR) ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గురువారం నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమైందని, ఇది అత్యంత కీలకమైన అంశమని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో SIR ప్రక్రియలో భాగంగా 95 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. మాజీ సీఎం మమతా బెనర్జీ 45 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికీ 27 లక్షల మంది తమ ఓటు హక్కు అన్యాయంగా తొలగించారని కోర్టులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదని, జాతీయ పార్టీలు ఏం చేస్తాయోననే అనుమానం తెలంగాణ ప్రజల్లో ఉందని అన్నారు. తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్లే తెలంగాణలో కూడా ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉందనే అనుమానం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>