హిందూ సమాజ సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా స్పందిస్తాం: అభిలాష్

కలం, వనపర్తి: హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా స్పందిస్తూ, హిందువులకు అందుబాటులో ఉండేలా ‘హిందూ వాహిని’ (Hindu Vahini) పనిచేస్తుందని హిందూ వాహిని విభాగ్‌ కన్వీనర్‌ అభిలాష్‌ హౌదేకార్‌ తెలిపారు. సోమవారం వనపర్తి (Wanaparthy) పట్టణ కేంద్రంలోని కేశవ స్మారక భవన్‌లో హిందూ వాహిని కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ కన్వీనర్‌గా జశ్వంత్, కో-కన్వీనర్లుగా నీలేష్, సంతోష్, చరణ్, యాదగిరి, కార్యవర్గ సభ్యులుగా అర్జున్, కార్తీక్, దేవా, రాజదీప్, నిఖిలేష్, యువరాజ్, మణిదీప్, నవీన్, చరణ్, రాఘవేంద్ర, రాహుల్, వంశీ, ధీరజ్, జశ్వంత్, జయప్రకాష్, హర్షదీప్, సాయినాథ్, భరత్ తదితరులను ఎంపిక చేశారు.

అనంతరం అభిలాష్‌ హౌదేకార్‌ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణ, మహిళల రక్షణ, యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించడం, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం వంటి అంశాలపై నూతన కమిటీ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా స్పందిస్తూ, హిందువులకు అందుబాటులో ఉండేలా హిందూ వాహిని పనిచేస్తుందని తెలిపారు.

పట్టణంలో సేవా కార్యక్రమాలతో పాటు యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు, ధార్మిక, సాంస్కృతిక, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని హిందూ సమాజం, హిందువుల ఐక్యత కోసం పనిచేస్తూ హిందూ వాహినిని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>