వ‌రుస ప్ర‌మాదాలు.. ట్రావెల్స్ బ‌స్సుల్లో ఏపీ పోలీస్ భ‌ద్ర‌తా చ‌ర్య‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస బ‌స్సు ప్ర‌మాదాలు ప్ర‌యాణికుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌ బ‌స్సుల్లో (Private Travel Buses) ప్ర‌యాణించాలంటేనే ఒక ర‌క‌మైన భ‌యం ఏర్ప‌డింది. రెండు మూడు ఘ‌ట‌న‌ల్లో బ‌స్సులు అగ్నిప్ర‌మాదాల‌కు గురై ప‌దుల సంఖ్య‌ల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ఏపీ పోలీసులు (AP Police) రంగంలోకి దిగారు. బస్సుల్లో భద్రతా చ‌ర్య‌ల‌పై ప్ర‌యాణికుల‌కు అవగాహన క‌ల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాల సమయంలో ఎమర్జెన్సీ డోర్లు, భద్రతా సదుపాయాల వినియోగంపై కీల‌క సూచ‌న‌లు అందిస్తున్నారు. బ‌స్సు ప్ర‌మాదానికి గురైతే ఎవ‌రూ బ‌స్సులో ఉన్న త‌మ‌ వ‌స్తువుల కోసం ఆలోచించ‌కూడ‌ద‌న్నారు. ముందు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు.

బ‌స్సు ఎక్కేట‌ప్పుడే ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ ఎక్క‌డుందో చూసుకోవాల‌ని సూచించారు. బ‌స్సు ప్ర‌మాదానికి గురైతే ధైర్యంగా ఉండాల‌ని, గాబ‌రా ప‌డ‌కుండా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు బ‌య‌ట‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాల‌ని చెప్పారు. ఇలా అన్ని బ‌స్సుల్లో ఎక్కి పోలీసులు (AP Police)  సూచ‌న‌లు అందించ‌లేమ‌ని, మీ బంధువులు స్నేహితులు ఈ విష‌యాల‌న్నీ తెలిసేలా చెప్పాల‌ని కోరారు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ యాజ‌మాన్యాల‌కు ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌, బ‌స్సుల కండీష‌న్‌పై హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. బ‌స్సుల కండీష‌న్ బాగుంటేనే వినియోగించాల‌ని సూచించారు.

Read Also: విజిలెన్స్ అధికారుల ముసుగులో మోసం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>