ప్రధాని మోదీ రిమోట్ ఆయన దగ్గరే ఉంది.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు (Hanumantha Rao) ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రిమోట్ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ (Mohan Bhagwat) చేతుల్లో ఉందని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న జనగణనలో బీసీల ప్రస్తావన లేదని వ్యాఖ్యానించారు. ‘బీసీలు (BCs) అంటే కేవలం ఓట్లేసే మిషన్లమా? ఎన్నికల సమయంలో మా ఓట్లు కావాలి కానీ.. అధికారం చేపట్టడానికి మేము పనికిరామా?’ అని ప్రశ్నించారు. మోదీ బీసీలపై కుట్రలు చేస్తున్నారన్న ఆయన… ‘మోదీ హఠావో.. ఓబీసీ బచావో’ అని నినాదించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కుల గణనను చేర్చకపోతే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని వీహెచ్ (Hanumantha Rao) హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన హక్కులు దక్కాలంటే కుల గణన తప్పనిసరి అని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం తాను యుద్ధానికి సిద్ధమయ్యానని వెల్లడించారు. మోదీ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేందుకు పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఇక దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

Read Also:  మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>