కలం, వెబ్ డెస్క్: పూల బొకేలు, శాలువాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం కంటే విద్యాదానం చేయడమే గొప్పదని కోలీవుడ్ నటుడు విశాల్ (Vishal) మరోసారి చాటిచెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ (CM Vijay) గౌరవార్థం విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థినుల ఉన్నత చదువులకు తానే స్వయంగా స్పాన్సర్‌షిప్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రిపై తనకు ఉన్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారు.
‘మనం ఇచ్చే ఒక బొకే కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.. కానీ ఒక చిన్నారికి అందించే విద్యాదానం జీవితాంతం వెలుగునిస్తుంది’ అంటున్నాడు. రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్‌కు (Vishal) ఇదొక అపురూపమైన బహుమతి అని అభిమానులు, నెటిజన్లు కొనియాడుతున్నారు. విశాల్ నిర్ణయంపై ప్రజల నుంచి కూడా భారీగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: కోపం కాదు.. కమ్యూనికేషన్ ముఖ్యం: నాగ్ అశ్విన్
Follow Us On: X(Twitter)

