కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా వర్గల్ (Wargal) మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హైదరాబాద్ వైపు అతివేగంగా దూసుకెళ్తున్న ఒక కారు, వర్గల్ కమాన్ బస్ స్టాప్ సమీపంలో ప్రయాణికులతో నిలిచి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది.
కారు ఢీకొట్టిన వేగానికి ఆటో పక్కనే ఉన్న స్కూటీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: కోపం కాదు.. కమ్యూనికేషన్ ముఖ్యం: నాగ్ అశ్విన్
Follow Us On: X(Twitter)

