కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు (Kadem Project) ను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

ఎల్ఈడీ తెరపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయి నీటిమట్టం ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం, ప్రస్తుత పరిస్థితులను మంత్రులకు వివరించారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి అవసరాలపై కూడా సమగ్ర సమాచారం అందించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి నిర్వహణకు శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కడెం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటిమట్టం, నీటి నిల్వ సామర్థ్యం, సిల్టేషన్ సమస్యలు, నీటి పారుదల నిర్వహణపై మంత్రులకు వివరించారు. ఈ పర్యటనలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>