పీవోకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నిరసనకారులపై పాక్‌ కాల్పులు

కలం, వెబ్ డెస్క్ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముజఫరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరసనలు తీవ్రరూపం దాల్చగా, వాటిని చెదరగొట్టేందుకు పాకిస్థాన్ భద్రతా బలగాలు టియర్‌గ్యాస్ ప్రయోగించాయి. కొన్ని ప్రాంతాల్లో కాల్పులు కూడా జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల్లో రాజకీయ జోక్యం, ఎన్నికల పారదర్శకత, స్థానిక హక్కుల అంశాలపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు.

రేపు (ఆదివారం) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ముజఫరాబాద్‌తో పాటు కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అదనపు ఆంక్షలు అమలు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>