Mobile Popup Ad
Mobile Popup Ad

కోపం కాదు.. కమ్యూనికేషన్ ముఖ్యం: నాగ్ అశ్విన్

కలం, సినిమా : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) నిర్మించిన ” సింగ్ గీతం “(Sing Geetham) మూవీ జూన్ 12న గ్రాండ్ రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా  సినిమా సెట్‌లో కోపం చూపించడం గురించి నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా షూటింగ్ సమయంలో “టీమ్ సభ్యులపై కోపం చూపించడం వల్ల పనిలో మెరుగుదల రాదు. అది కొత్త సమస్యలకు దారితీస్తుంది,” అని నాగ్ అశ్విన్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యంతో కష్టపడుతున్నప్పుడు, ఒకరిని ఒకరు నిందించడం కంటే సమస్యలకు పరిష్కారం కనుగొనడంపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సినిమా నిర్మాణం అనేది పూర్తిగా టీమ్ వర్క్ అని, అందరి సహకారం లేకుండా మంచి ఫలితాలు సాధ్యం కావని స్పష్టం చేశారు. సెట్‌లో శాంతంగా, పరస్పర గౌరవంతో వ్యవహరిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినీ రంగంలో పనిచేసే వారికి మాత్రమే కాకుండా, ప్రతి రంగంలో ఉన్న వారికి కూడా ఇది మంచి మార్గదర్శకంగా భావిస్తున్నారు.

Read Also: ‘పెద్ది’ ప్రభావం.. రామ్ చరణ్–సుకుమార్ మూవీ ఆలస్యం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>