కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెం రోడ్డులో మంజీరా పైప్ లైన్ లీక్ అవుతుండటంతో తాగు నీరు వృథాగా పోతోంది. నెల రోజులుగా ఇలా జరుగుతున్నా, సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు తాగు నీటితో ఇబ్బందులు పడుతుంటే, వృథాగా నీరు పోతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై మండిపడుతున్నారు. కంది ప్రాంతంలోని పలు చోట్ల కూడా పైప్ లైన్ లీకేజీ అవుతూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి, నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.

