కలం, స్పోర్ట్స్: 2027 వరల్డ్ కప్‌కు ముందు బీసీసీఐకి కింగ్ కోహ్లీ (Virat Kohli) డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీ వార్నింగ్‌తో వరల్డ్ కప్ జట్టు విషయంలో బీసీసీఐ డైలమాలో పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాక సెలక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. “నన్ను జట్టులో ఉంచాలనుకుంటున్నారా..? లేక వద్దనుకుంటున్నారా..? ఇప్పుడే తేల్చండి.. ప్రతి సారి నా విలువ నిరూపించుకోమంటే నేను ఆడను!” అంటూ సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. “నాకు అవసరం లేదనుకుంటే మొదటి రోజే చెప్పండి.. నేను స్వయంగా తప్పుకుంటా” అన్న ఒక్క మాటతోనే క్రికెట్ వర్గాల్లో హాట్ డిబేట్ మొదలైంది.
టీ20లకు, టెస్టులకు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపైనే ఫోకస్ పెట్టాడు. కానీ బీసీసీఐ (BCCI) మాత్రం భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్ల వైపు చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు బోర్డును డైరెక్ట్‌గా టార్గెట్ చేసినట్టుగా మారాయి. “ఫిట్‌నెస్ లేదు.. వర్క్‌లోడ్ ఎక్కువ” అనే కారణాలు తనకు వర్తించవని కూడా కోహ్లీ స్పష్టం చేశాడు. “ఇప్పటికీ 40 ఓవర్లు ఫీల్డింగ్ చేసినా అలసట ఉండదు” అంటూ తన ఫిట్‌నెస్‌పై కింగ్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది వన్డేల్లో 651 పరుగులు, 3 సెంచరీలు.. ఈ ఏడాది కూడా సెంచరీతో సత్తా చాటిన కోహ్లీ.. ఇంకా తానే బెస్ట్ అని చెప్పకనే చెప్పాడు.
ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే..! 2027 వరల్డ్‌కప్ వరకు కోహ్లీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేక “ట్రాన్సిషన్” పేరుతో కింగ్ కెరీర్‌కు బ్రేక్ వేయాలనుకుంటుందా..? దీంతో ఇప్పుడు భారత క్రికెట్‌లో అసలు పవర్ గేమ్ మొదలైందనే చర్చ జోరందుకుంది.

