కలం, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. బ్రిటీషర్ల నిర్బంధ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

