కలం, నిర్మల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్మల్ స్పెషల్ సబ్ జైలు (Nirmal Special Sub Jail) పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జైలర్ పి. సూర్య ప్రకాష్ రెడ్డి (Surya Prakash Reddy)కి ఉత్తమ సేవ అవార్డు లభించింది. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును (Best Service Award) అందుకున్నారు. జైళ్ల శాఖలో విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, అంకితభావం, ఉత్తమ సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ రెడ్డిని అధికారులు, సిబ్బంది అభినందించారు.

