రేపు మూడు జిల్లాల్లో సీఎం పర్యటన.. షెడ్యూల్ విడుదల!

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ఆదివారం ఉదయం హెలికాప్టర్‌లో బయల్దేరి మొదట కామారెడ్డి జిల్లాకు వెళ్తారు. బిచ్కుంద మండలం కందర్‌పల్లి గ్రామానికి చేరుకుంటారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి ములుగు జిల్లాకు వెళ్తారు. మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు.

అక్కడి నుంచి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. గట్టమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించబోతున్నారు. కొత్త కలెక్టరేట్ భవనాన్ని మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించబోతున్నారు. వివిధ శాఖలకు కేటాయించిన కార్యాలయాలను పరిశీలిస్తారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీస్తారు.

పరకాలలో భారీ బహిరంగ సభ..

ములుగు నుంచి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చేరుకుంటారు. ఇక్కడ వంద పడుకల ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అంగడి స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపడుతున్నారు. సభ ముగిసిన వెంటనే హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ రానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>