కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి (Bheemadevarapally) మండలం గట్లనర్సింగాపూర్ గ్రామస్తులు మానవత్వాన్ని చాటుతూ నిరుపేద గిరిజన కుటుంబానికి చేయూతనందించారు. గ్రామానికి చెందిన అజ్మీర సోనీ భర్త రాజు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా ఇద్దరు చిన్న పిల్లల దీనస్థితి గ్రామస్తులను కలచివేసింది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.30 వేలు సేకరించి ఆ మొత్తాన్ని పిల్లల పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేశారు. 5వ వార్డు సభ్యుడు కాసనగొట్టు సాయిరాం సమన్వయం చేయగా, గ్రామస్తులందరూ ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య, వార్డు సభ్యుడు సంగ ఐలయ్య, గ్రామస్తులు ముత్యాల రవి, బానోతు గంగయ్య, రాణి, ప్రవీణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ‘కింగ్’ ఈజ్ బ్యాక్.. మళ్లీ షారుఖ్, దీపిక!
Follow Us On: X(Twitter)

