Mobile Popup Ad
Mobile Popup Ad

‘కింగ్’ ఈజ్ బ్యాక్.. మళ్లీ షారుఖ్, దీపిక!

కలం, సినిమా డెస్క్: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె జంటకు హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. వీళ్ల కలయికలో ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ‘కింగ్’ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే దీపికపై యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు.

రెండోసారి తల్లిగా.. అనేక గాసిప్స్

రెండోసారి తల్లి కాబోతున్నట్లు ఇటీవలే దీపిక ప్రకటించడంతో.. ‘కింగ్’లో పూర్తి స్థాయిలో నటించకపోవచ్చనే గాసిప్స్ బాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. అదే విధంగా అల్లు అర్జున్ కు జోడీగా ‘రాకా’ చిత్రంలోనూ నటిస్తుండగా.. అక్కడ సైతం ఆమె రోల్ పరిమితంగానే ఉంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవన్నీ రూమర్స్ అంటూ దీపిక టీం ఖండించింది. రెండు చిత్రాల్లోనూ దీపిక ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుందని క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ‘కింగ్’ రిలీజ్ అవుతుందంటూ ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

Read Also: పెళ్లిలో ఇదో కొత్త ట్రెండ్.. ఈ హైటెక్ మర్యాదలు చూస్తే షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>