కలం, వెబ్ డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) ఉద్దేశించి కొందరు ఏర్పాటు చేసిన విమర్శనాత్మక బ్యానర్‌పై బీఆర్ఎస్ కార్యకర్త విచిత్ర వాదనకు దిగారు. కేటీఆర్ బర్త్ వేడుకల బ్యానర్‌గా పొరబడి రచ్చ రచ్చ చేసిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ కొందరు పెట్టి బ్యానర్‌ను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రయత్నించింది. ఆ కార్యకర్త అక్కడికి చేరుకుని వారితో తీవ్రంగా గొడవకు దిగాడు.
‘ఇప్పుడే మా కేటీఆర్ బ్యానర్ కట్టాం, దాన్ని ఎందుకు తీసేస్తున్నారు? అంటూ జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ బ్యానర్ ఎందుకు పెట్టారో అసలు మీకు తెలుసా? ఆయన పుట్టినరోజు కాబట్టే పెట్టాం!” అంటూ ఆ బ్యానర్‌లోని అసలు విషయాన్ని గమనించకుండానే మాట్లాడాడు. సొంత నాయకుడి పుట్టినరోజు ఫ్లెక్సీగా భావించి ఆ కార్యకర్త ప్రదర్శించిన అమాయకత్వం చూసి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
-కేటీఆర్ బ్యానర్‌పై సొంత పార్టీ కార్యకర్త విచిత్ర వాదన
-సోషల్ మీడియాలో వైరల్
-పింకీస్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్#KTR #PaperLeak #PaperleakinBRSGovt #Kalam #Kalamdaily #KalamPaper pic.twitter.com/nOBk2axuRh— Kalam Daily (@kalamtelugu) July 24, 2026

