Mobile Popup Ad
Mobile Popup Ad

పంజాగుట్ట పోలీసులపై హైకోర్ట్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: పంజాగుట్ట పోలీసులపై హైకోర్ట్ (High Court) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన లాయర్ సుబ్బారావుకి సీఐ రామకృష్ణ బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసిన విషయంలో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. సీఐపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు, స్టేషన్‌లో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరిచారా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు, అడ్వకేట్లు కలిసి పనిచేయాలని హితవు పలికింది. తనకు మంగ్లీ నుంచి ప్రాణహాని ఉందని, పోలీస్ భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని సుబ్బారావు కోరగా.. వేసవి సెలవుల తరువాతనే విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది.

అసలు ఏం జరిగిందంటే..

మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ తరఫున కొందరు అమాయకుల నుంచి రూ.200 కోట్ల మేర వసూలు చేసి ఎగ్గొట్టారనేది ప్రధాన అభియోగం. దీనిపై, బాధితుల తరఫున లాయర్ సుబ్బారావు వాదిస్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్టలో నమోదైన కేసు విషయమై స్టేషన్ కు రాగా, సీఐ రామకృష్ణ ఆయనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడం వివాదంగా మారింది. దీనిపై న్యాయవాద సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపగా.. కోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారించిన కోర్ట్, న్యాయవాదికి పోలీస్ స్టేషన్ లో ఎలా టెస్ట్ చేస్తారు.. ఏ చట్టం చెబుతోందని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>