మోడీని అంటే ఈ కేడీకి ఏం అయింది?: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: నీట్ విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే.. మధ్యలో కాంగ్రెస్ వాళ్లు తమను అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. బడే భాయ్ కోసం ఈ చోటే భాయ్ అడ్డు పడుతున్నాడని ఎద్దేవా చేశారు. మోడీని అంటే ఈ కేడీకి ఏం అయిందని.. ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యార్థులను గొడ్డులను కొట్టినట్లు కొడుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తున్నాడని విమర్శించారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, ‘జెన్ జీ’ యువత నీట్ పేపర్ లీకేజీపై కేంద్రంపై గళమెత్తుతుంటే.. రేవంత్ రెడ్డికి మాత్రం కేసీఆర్, కేటీఆర్ జపమే తప్ప వేరే ధ్యాసే లేదని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను నిలదీసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. పాత కేసులు, భయాలతో మోడీకి లొంగిపోయి.. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>