Mobile Popup Ad
Mobile Popup Ad

విజయవాడ రెయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : విజయవాడలోని ప్రముఖ రెయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పిటల్‌ (Rainbow Childrens Hospital) లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్‌లోని చిన్నపిల్లల ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఆందోళన చెందారు. ఊపిరాడక, ఏం జరుగుతుందో తెలియక రోగులు, వారి బంధువులు కాసేపు కేకలు, ఆర్తనాదాలు చేశారు. అయితే ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో ఆసుపత్రిలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంచెం ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Read Also: రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>