కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సప్లిమెంటరీ ఫలితాలను (AP Inter Supply Results) రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విద్యార్థులను తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ http://bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ-గవర్నెన్స్ సేవల్లో భాగంగా విద్యార్థులు తమ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా కూడా చాలా సులభంగా రిజల్ట్స్ పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బోర్డు పేర్కొంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించింది.
Read Also: బరువు తగ్గాలనుకుంటున్నారా? మధ్యాహ్నం ఈ తప్పులు చేయకండి!
Follow Us On: X(Twitter)

