కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వారి హక్కుల గొంతుకగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (TGMEU) నిలబడిందని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో బ్రాంచి వెంకటేష్ అధ్యక్షతన టీజీఎంఈయూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుకు యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మధుసూదన్ రెడ్డి సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైద్య ఉద్యోగుల హక్కుల పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఎంఈయూ తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు రద్దుతో పాటు వైద్య జేఏసీ ఏర్పాటు చేసి రాజీ లేని పోరాటం చేసి సాధించిందని గుర్తు చేశారు.
వైద్య సిబ్బందిపై దాడులు..
టీజీఎంఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య సిబ్బందిపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయడమే కాకుండా, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోటేశ్వర్ రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేత అరుణ్, ఔట్ సోర్సింగ్ బ్రాంచ్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, సతీష్ రెడ్డి, కరుణాకర్, నర్సింగ్ ఆఫీసర్స్ శ్రావణి, నేతలు రంగన్న, దేవానంద్, చెన్నయ్య, మొగులయ్య, బాలకోటి, అంజి, యాదయ్య, భీమయ్య, శ్రీనివాసరెడ్డి, మున్నా, నరేష్, రాఘవేందర్, కృష్ణ, సత్యమ్మ, నాగమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, వరలక్ష్మి, సునీత, లక్ష్మి, జ్యోతి చంద్రకళ, కవిత, సుధా, నిరీక్షణ, మంజుల, పద్మ, చిట్టెమ్మ, నాగమణి, సరోజ పాల్గొన్నారు.
Read Also: సోలార్ ప్లాంట్ పెట్టండి.. లాభాలు ఆర్జించండి: బండి సంజయ్
Follow Us On: X(Twitter)

