కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. తమిళనాడు 18వ ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ (Vijay) రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో గవర్నర్ అర్లేకర్‌తో విజయ్ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మద్దతు పత్రాలను అందజేశారు.
తొలుత ఈ వేడుకను మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించాలని భావించినప్పటికీ, తాజాగా రేపు ఉదయం 10 గంటలకే జరపాలని ముహూర్తాన్ని ఖరారు చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ భారీ కార్యక్రమానికి సర్వం సిద్ధమవువుతోంది. విజయ్‌తోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో అటు అభిమానుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
లోక్ భవన్ అధికారిక ప్రకటన
టీవీకే పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతుతో విజయ్ (Vijay) పలుమార్లు తమిళనాడు గవర్నర్ కలిసిన విషయం తెలిసిందే. చివరకు నాలుగోసారి ఆయనకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎట్టకేలకు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు మే 9 లోక్ భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: కొడుకు వివాదం.. స్పందించిన బండి సంజయ్!
Follow Us On: WhatsApp

