కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ (Kanpur Accident ) పరిధిలోని కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవాస్ వికాస్-3 ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన థార్ కార్ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న స్వరాజ్ నగర్‌కు చెందిన సంతోష్ సింగ్ చౌహాన్ (55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే ప్రమాదం జరిగిన తీరు ప్రత్యక్ష సాక్షులను భయభ్రాంతులకు గురిచేసింది. స్కూటీని ఢీకొట్టిన తర్వాత థార్ వాహనం సంతోష్ సింగ్‌ను దాదాపు 20 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లి సమీపంలోని ఒక ఇంటి ప్రాంగణం, పిలర్‌ను గుద్దడంతో ఆగింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ఉన్న యువతులతో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చిన మరొక కారులో ఎక్కి సంఘటనా స్థలం నుండి పరారయ్యారు.
సమాచారం అందుకున్న కల్యాణ్‌పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన థార్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దాని నంబర్ ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.

