అరుణాదేవి సేవలు అభినందనీయం: యాదగిరి సునీల్ రావు

కలం, కరీంనగర్ : సాంఘిక సంక్షేమ శాఖలో గురుకుల హాస్టల్ వార్డెన్ గా అరుణాదేవి 38 సంవత్సరాల సుదీర్ఘమైన సేవలు అందించడం అభినందనీయమని కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు (Yadagiri Sunil Rao) అన్నారు. నగరంలో నిర్వహించిన అరుణాదేవి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. అరుణాదేవి- నరసింహస్వామి దంపతులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుణా దేవి 38 సంవత్సరాలు గురుకుల హాస్టల్ వార్డెన్ గా ఎంతోమంది విద్యార్థుల బాగోగులను చూసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తోకల భూమేశ్వర్, వడ్డే శ్రీరామ్ రెడ్డి, చీకోటి గాంధీ, వెంకటేశ్వరరావు, ఎనగందుల వెంకన్న, తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>